శ్రీరామనవమి శుభాకాంక్షలు
● కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌టౌన్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమిని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో సుస్థిర పాలనను కొనసాగిస్తూ ప్రపంచ ఆర్థిక ప్రగతిలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు, అవినీతిరహిత పాలనను కొనసాగించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
‘స్పేసర్ల’తో విద్యుత్ ప్రమాదాలకు చెక్
కొత్తపల్లి: ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ సంస్థ అప్రమత్తమవుతోంది. విద్యుత్ తీగలు వదులుగా, ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపడుతోంది. గాలి దుమారాలు వచ్చినప్పుడు విద్యుత్ తీగలు ఒకటి ఒకటి తగిలి ఫేస్ టూ ఫేస్ వల్ల వైర్లు తెగడంతో పా టు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫీజులు పోవడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే ప్రమాదముంది. ఇళ్లల్లో షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో విలువైన గృహోపకరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకున్న విద్యుత్ సంస్థ ప్రమాదాల నివారణకు కార్యాచరణ చేపట్టింది. విద్యుత్ వైర్లు ఒకటికొకటి తగలకుండా స్పేసర్ల బిగింపు పనులు చేపడుతున్నారు. కరీంనగర్ టౌన్–1 సబ్ డివిజన్ సెక్షన్ 8 పరిధిలోని అశోక్‌నగర్‌లో నిచ్చెనసాయంతో విద్యుత్ సిబ్బంది ‘స్పేసర్ల’ బిగింపు పనులు నిర్వహించారు.సిబ్బంది సాహసోపేతంగా చేపడుతున్న పనులు చూసి పలువురు అభినందిస్తున్నారు.
కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు పొడిగింపు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు నిషేధాజ్ఞలు నెలరోజుల పాటు కొనసాగిస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సే వించడం, డీజేల వినియోగం, డ్రోన్ల వినియోగంపై ఈనెల 30వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసకుంటామని పేర్కొన్నారు.
రామాయణం నిరంతర పారాయణ గ్రంథం
కరీంనగర్‌కల్చరల్: రామాయణం నిరంతరం అందరికీ పారాయణ గ్రంథమని సాహతీవేత్త, అవధాని గండ్ర లక్ష్మణరావు అన్నారు. నగరంలోని వాగేశ్వరీ డిగ్రీ కళాశాలలో శనివారం రుద్రమ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మొల్ల రామాయణంపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మొల్ల రాసిన రామాయణం సామాన్యులకు సైతం అనుకూలంగా ఉందన్నారు. ప్రధాన వక్తగా హాజరైన విశ్రాంత ఉపన్యాసకుడు అన్నాడి గజేందర్‌రెడ్డి మొల్ల రామాయణం విశిష్టతతో పాటు అందులోని పద్యాలను వినిపించారు. ఏదునూరి రాజేశ్వరి మాట్లాడుతూ ఓ సీ్త్రగా గొప్పగా ఆనాటి సామాజిక పరిస్థితులను ఎదిరించి రామాయణం రచించిందని వివరించారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామనవమి శుభాకాంక్షలు


