
సీసీఎల్ డైరెక్టర్ సింగరేణి వారసుడు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారి తనయుడు అనూప్ అంజూరా సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనూప్ అంజూరాను సీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్‌గా ప్రత్యేక కమిటీ రికమండ్ చేసింది. సింగరేణి ఆర్జీ–2 ఏరియాలోని జీడీకే–9వగనిలో ఏజెంట్‌గా, కొత్తగూడెం ఏరియా జీఎంగా పనిచేసి రిటైర్ అయిన సీఎల్ అంజూర ఈప్రాంత వాసులకు సుపరిచితులు. ఆయన తనయుడు అనూప్‌అంజూరా గోదావరిఖనిలోని యైటింక్లయిన్‌కాలనీ సింగరేణి పాఠశాల, గోదావరిఖని సెయింట్ క్లెయిర్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు.