‘లయ’ తప్పుతోంది! | - | Sakshi
Sakshi News home page

‘లయ’ తప్పుతోంది!

Sep 29 2025 8:28 AM | Updated on Sep 29 2025 8:28 AM

‘లయ’

‘లయ’ తప్పుతోంది!

జాగ్రత్తలతో గుండె జబ్బులు దూరం

వయస్సుతో సంబంధం లేకుండా..

చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని గుండె జబ్బు ప్రస్తుతం వేధిస్తోంది. వాతావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన పని విధానం, సరైన నిద్రలేకపోవడం, ధూమపానం తదితరాలు దీనికి కారణభూతమవుతున్నాయి. జిల్లాలో గుండెపోటు రోగులు ఎక్కువవుతున్నారు. హృద్రోగ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా గుండెపోటుతో క్షణంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల కాలంలో 20 ఏళ్లు నిండినవారికి సైతం గుండెపోటు వచ్చి మరణించడం కలకలం రేపుతోంది. చిన్నతనం నుంచే తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు.

జిల్లాలో 3.5 లక్షల మంది హృద్రోగులు

జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా జనాభాలో ఇది దాదాపు 15 శాతం కావడం ఆందోళన కలిగిస్తోంది. హృద్రోగ సమస్యలతో నిత్యం వెయ్యి మంది రోగులు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 15 మంది నిపుణులు రోగులకు సేవలందిస్తున్నారు.

గోల్డెన్‌ హవర్‌ కీలకం

ఛాతిలో నొప్పి వస్తే ఒక్కోసారి గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ వల్ల వచ్చిందా లేదా గుండెపోటా.. అనేది గుర్తించడం కష్టం. వీపు ప్రాంతం నుంచి భుజం మీదుగా ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు.. చెమటలు పట్టి శరీరం చల్లగా అయిపోతున్నట్లు ఉంటే దాన్ని గుండెపోటుగా భావించాలి. ఇలా నొప్పి వచ్చినప్పుడు మొదటి గంటలో వైద్యం అందిస్తే రోగి తక్షణమే కోలుకుంటారు. దీన్నే గోల్డెన్‌ హవర్‌ అంటారు. అయితే మొదటి గంటలో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు యాస్ప్రిన్‌ మాత్రలతో కూడిన మూడు మాత్రల కిట్‌ నమిలి మింగాలి. ఇలా చేస్తే గుండె జబ్బు సగం తగ్గిపోతుంది. ఒక వేళ గుండెనొప్పి కాకపోయినా యాస్ప్రిన్‌ మాత్ర వేసుకున్నా నష్టం జరగదు. ఆస్పత్రికి వెళ్లాక పరీక్షలు చేసి చికిత్స ద్వారా ప్రాణాపాయాన్ని నివారించొచ్చు.

ఆధునిక జీవన విధానమే కారణం

గుండె వ్యాధులకు ప్రధాన కారణం ఆధునిక జీవన విధానమే. తగిన శారీరక శ్రమలేకపోవడం, జంక్‌ ఫుడ్స్‌, తగిన విశ్రాంతి తీసుకోకపోవడం, నిద్రలేమి, అతిగా ఆయిల్‌ ఫుడ్‌ తీసుకోవడం, ఊబకాయం, మ ధుమేహం నియంత్రణలో లేకపోవడం తదితరాలు దీనికి కారణమవుతున్నాయి. పర్యావరణం కాలు ష్యం, ధూమపానం కూడా ఓ కారణమవుతోంది.

కరీంనగర్‌టౌన్‌: గుండెపోటు.. ఈ పదం వింటేనే ఎంతో మందికి వణుకు పుడుతోంది. ఇది పెద్దలకే వస్తుంది.. మనకేంటనే ధీమా చాలా మంది నడివయస్కులు, యువతలో ఉండేది. అయితే మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, ఒత్తిడితో కూడుకున్న పని వాతావరణం తదితర కారణాలతో దాదాపు అందరికీ ఈ ముప్పు ప్రస్తుతం పొంచి ఉంది. గుండె రక్తనాళాలు మూసుకుపోవడంతో హార్ట్‌ అటాక్‌కు గురై ఇట్టే కుప్పకూలి మృత్యువాతపడుతున్నారు. ఈ తరుణంలో హృద్రోగ సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా సెప్టెంబర్‌ 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తోంది.

జిల్లాలో పెరుగుతున్న హృద్రోగ బాధితులు

యువతలోనూ తీవ్రమవుతున్న సమస్య

చిన్నతనం నుంచే జాగ్రత్తలు అవసరం

నేడు వరల్డ్‌ హార్ట్‌ డే

గతానికి భిన్నంగా యువతలోనూ గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. జంక్‌ ఫుడ్స్‌, ధూమపానానికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి. 30 ఏళ్లు నిండినవారు ఏడాదికోసారైనా కొలెస్ట్రాల్‌ లాంటి పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి. ఛాతిలో మంట, నొ ప్పి లాంటి సమస్యలుంటే దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి.

– డాక్టర్‌ వాసుదేవరెడ్డి, కార్డియాలజిస్టు

‘లయ’ తప్పుతోంది!1
1/1

‘లయ’ తప్పుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement