
దూలూర్ యువకుడి తీన్మార్
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దూలూర్ గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ గ్రూప్స్ ఫలితాల్లో మూడుసార్లు సత్తాచాటాడు. గ్రూప్–2లో సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల గ్రూప్–3 ఫలితాల్లో సత్తా చాటి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–4 ద్వారా ఎంపికై జగిత్యాలలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీనివాస్ తండ్రి ఆకుల లక్ష్మీనర్సయ్య మేడిపెల్లి ఎంఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు.