జిల్లాకేంద్రంలోని కమాన్‌చౌరస్తాలో గల లక్ష్మిశ్రీ టిఫిన్ సెంటర్‌లో ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 వరకు అల్పాహారం దొరుకుద్ది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో సోమవారం నుంచి టిఫిన్‌సెంటర్ మూసివేసినట్లు యజమాని శ్రీనివాస్ హోటల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందనే ప్రచారంతో ఖాళీ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరూ గ్యాస్ బుకింగ్ కోసం ఎగబడుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ ఫోన్లు కలవడం లేదు. దీంతో వినియోగదారులు నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి బుక్ చేయమని నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు.


