కట్టెల పొయ్యే దిక్కా..?
విద్యా రంగానికి నిధులేవి?
తెలంగాణచౌక్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో కూర్చున్న ఆశా వర్కర్లు
భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు
కరీంనగర్‌టౌన్: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గ్యాస్ సిలిండర్ల కొరతతో రాబోయే రోజుల్లో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉందని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. గ్యాస్ కొరత, ధరల పెంపు సరికాదని నగరంలోని తెలంగాణ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ విధానాలపై స్పందించాలన్నారు. పార్టీ శ్రేణులు పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు తదితరులున్నారు.
కరీంనగర్‌టౌన్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాల ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చొని, భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యం అవుతోందన్నారు. జిల్లావ్యాప్తంగా సంక్షేమహాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కాంపెల్లి అరవింద్, వినయ్ సాగర్, గట్టు ఆకాశ్, భోగేశ్వర్, మానస, సురేశ్, సందేశ్, రక్షక్, అక్షయ్, రమేశ్, సిరివెన్నెల పాల్గొన్నారు.
కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రూ.18,000వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆశావర్కర్లు ధర్నా చేపట్టారు. సీఐటీ యూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే ఆశావర్కర్లు ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. ఆశా వర్క ర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, వెంటనే అమలు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు సారిక, రజిత ఉన్నారు.


