న్యూస్‌రీల్
పార్టీ మారే యోచనలో
మాజీ మంత్రి?
జగిత్యాలలోని తన నివాసంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు
ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై వరుస విమర్శలు
పార్టీ రంగు.. గుర్తుకు.. రాంరాం అంటూ వ్యాఖ్యలు
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం చర్చనీయాంశంగా మారుతోంది. జగిత్యాలలోని త న నివాసంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడంతో పాటు ‘పార్టీ రంగు, గుర్తుకు రాంరాం’ అంటూ కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాలుగు దశాబ్దాలుగా అంకితభా వంతో పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. కష్టకాలంలోనూ కాంగ్రెస్‌ను విడిచి వెళ్లకుండా నిలబడ్డ నాయకుల్లో ఆయన ఒకరు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్య క్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై ఇటీవల వరుసగా విమర్శలు చేయడం గమనార్హం.
ప్రభుత్వంపై విమర్శలు
కొన్ని నెలలుగా ప్రభుత్వ పనితీరు, పార్టీలో ఇంటిపోరు, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలపై జీవన్‌రెడ్డి అసంతృప్తిగా ఉండడంతో పాటు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఆయ న నివాసంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించడం ఈ నిర్ణయానికి సంకేతంగా భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో జీవన్‌రెడ్డి కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెల్సీగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జిల్లా రాజకీయాల్లో ఆయనకు బలమైన అనుచర వర్గం ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయిన్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకోలేరు. అప్పటి నుంచే తన సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం కాాంగ్రెస్ పార్టీపై జిల్లాలో కొంత మేర ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జీవన్‌రెడ్డి దారెటు?
సీనియర్ నేత తదుపరి రాజకీయ అడుగు ఏంట న్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఏ పార్టీలో చేరుతారన్న విషయంపై స్పష్టత రాలేదు. అయినప్పటికీ కేసీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని బీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న పరిస్థితుల్లో జీవన్‌రెడ్డి నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జగిత్యాలలో కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు ఘటనతో మొదలైన ఈ రాజకీయ చర్చలు ఇప్పుడు రాష్ట్రస్థాయికి చేరాయి. జీవన్ రెడ్డి అధికారికంగా పార్టీని వీడే ప్రకటన ఎప్పుడు చేస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


