కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే పంథాగా చర్యలు చేపట్టారు కలెక్టర్ చిత్రా మిశ్రా. ప్రజావాణికి వచ్చే ప్రతీ అర్జీకి పరిష్కారం ఉండాలని ఆదేశించారు. గత విధానానికి స్వస్తి పలికి నూ తన విధానం అమలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఫిర్యాదుపై రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కంప్యూటర్ సిబ్బంది రసీదు ఇచ్చాక అధికారులను కలవాల్సి ఉండేది. ఇప్పుడు ఎడమ వైపు నుంచి ఇన్ కుడి వైపు నుంచి అవుట్ విధానం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాకే కంప్యూటర్ సిబ్బంది నుంచి రసీదు తీసుకునేలా మార్పులు చేశారు. అర్జీదారు కౌంటర్ వద్ద ఎన్రోల్ చేసుకుని కలెక్టర్, ఉన్నతాధికారులకు అందజేసిన తదుపరి ఎవరికి ఎండార్స్ చేయాలనేది నిర్ణయిస్తారు. తదుపరి కంప్యూటర్ సిబ్బంది వద్ద రసీదు తీసుకోవాలి. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపిస్తారు. రెవెన్యూ అయితే డీఏవో కు, పంచాయితీరాజ్ అయితే జెడ్పీకి సంబంధిత జిల్లా అధికారులకు అందిస్తారు. దీంతో ప్రతి అర్జీపై స్పష్టత ఉండనుంది. సోమవారం నాటి ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా అర్జీలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొనగా.. 290 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.
ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 290
మున్సిపల్ కార్పొరేషన్: 94
హౌసింగ్ పీడీ: 12
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 10
ఆర్డీవో కరీంనగర్: 09
డీపీవో: 08


