గుప్తనిధి కోసం బాలింత దహనం? | - | Sakshi

ఉగాది అమావాస్య రోజున ఘోరం జరిగింది.

Mar 22 2023 2:04 AM | Updated on Mar 22 2023 7:26 AM

- - Sakshi

సోమవారం రాత్రి అమావాస్య ఘడియల్లో బాలింత మహిళను గుప్త నిధి కోసం

సాక్షి, బళ్లారి: ఉగాది అమావాస్య రోజున కొప్పళ జిల్లాలో ఘోరం జరిగింది. సోమవారం రాత్రి అమావాస్య ఘడియల్లో బాలింత మహిళను గుప్త నిధి కోసం కాల్చి వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గబ్బూరు గ్రామానికి చెందిన కే.నేత్రావతి (26) అనే మహిళకు ఒకటిన్నర నెలల పసికందు ఉంది.

బాలింత మహిళను బలి ఇస్తే గుప్త నిధులు బయటకు వస్తాయన్న ఆశతో కొందరు దుర్మార్గులు ఆమెను హత్య చేసి కాల్చివేశారా? లేక ప్రాణాలతో ఉన్నప్పుడే సజీవ దహనం చేశారా? అన్న విషయంలో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది. దుండగుల కోసం కొప్పళ గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement