కర్ణాటక: ప్రపంచానికి దశాబ్దాల కాలం పాటు బంగారాన్ని అందించిన కేజీఎఫ్‌లో భారీ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గని కార్మికులు విజయమాల ను ఎవరి మెడలో వేస్తారనేది కుతూహలంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, జేడీఎస్, ఆర్‌పిఐ మధ్య పోటీ నెలకొంది. గతంలో జాతీయ పార్టీల కంటే తమిళనాడు అన్నా డిఎంకె పార్టీ హవా ఎక్కువగా ఉండింది. నియోజకవర్గం పునర్విభజన తరువాత ప్రాదేశిక పార్టీల ప్రాధాన్యం తగ్గి దాని స్థానాన్ని జాతీయ పా ర్టీలు ఆక్రమించాయి. జాతీయ పార్టీల వైపునకు ఓటర్లు మొగ్గు చూపడం ప్రారంభించారు.
నలుగురు అభ్యర్థులు
కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపా శశిధర్ తిరిగి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి అశ్విని సంపంగి విజయం కోసం కొంగు బిగించారు. ఈ మహిళల మధ్య పోరాటంలో రెండుసార్లు మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేంద్రన్ ఆర్‌పిఐ పార్టీ నుంచి, అలాగే జేడీఎస్ నుంచి డాక్టర్ రమేష్‌బాబు పోటీ పడుతున్నారు.
అందరికీ గెలుపు ధీమా
ఐదేళ్లలో చేసిన అభివృధ్ది కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి రూపా శశిధర్ ప్రచారంలో ఉన్నారు. ఆమెకు తండ్రి, మాజీ కేంద్రమంత్రి మునియప్ప అభిమానులు అండగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అశ్విని సంపంగి గత ఓటమిని నుంచి ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. బీజేపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేసి విఫలమైన బీజేపీ నాయకుడు మోహనకృష్ణ ఆమెకు మద్దతు ఇవ్వకపోవడంతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. కార్మికులు, వామపక్షాల ప్రభావం అధికంగా ఉన్న కేజీఎఫ్‌లో ప్రజల మద్దతు తనదేనని రాజేంద్రన్ అన్నారు.
కేజీఎఫ్‌లో వనితల పోటాపోటీ
కేజీఎఫ్ అంటే ఇటీవల కన్నడ సినీ రంగానికి కొత్త దారి చూపిన హిట్ మూవీ అని చాలా మంది అనుకుంటారు. బ్రిటిష్ కాలంనాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని కంపెనీ పేరుతోనే ఈ నియోజకవర్గం ఎప్పుడో ఏర్పడింది. నిన్నటి తరం వారికి బాగా తెలిసినా, కేజీఎఫ్ సినిమా అనేది ఈ ఊరి పేరును మారుమోగేలా చేసిందనడంలో సందేహం లేదు. ఇక్కడ ఎన్నికల సందడి సినిమా స్థాయిలో లేకున్నా బాగానే నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి వనితలే తలపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment