
ఆ కుంభమేళా చిత్రం నకిలీది
మైసూరు: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తాను స్నానం చేసినట్లుగా గ్రాఫిక్స్ ఫోటోను సృష్టించి వైరల్ చేశాడంటూ సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబర్గిపై బహుభాషా సినీ నటుడు ప్రకాష్ రాజ్ మైసూరులోని లక్ష్మీపుర స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ తాను ఎప్పుడైనా మతం గురించి మాట్లాడానా? వీరు మతాన్ని రెచ్చగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్ సంబర్గి ఎవరో నాకు తెలియదన్నారు. అతను ఏఐ గ్రాఫిక్స్‌తో తన నకిలీ ఫొటోను సృష్టించి అపప్రచారం చేస్తున్నాడని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించానని చెప్పారు. మహాకుంభమేళా హిందువులకు, దేవున్ని నమ్మేవారికి పుణ్యస్థలమని అన్నారు.
హిందూ వ్యతిరేకి అని ప్రచారం
ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వాపోయారు. ప్రజల నమ్మకానికి విఘాతం కలుగుతోందని, గతంలో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కేసు వేసి గెలిచానని, సంబర్గి 15 రోజుల్లో స్టేషన్‌కు వచ్చి సమాధానం ఇవ్వాలన్నారు. సంబర్గి ఇలానే చాలా మంది నటీనటులను వేధింపులకు గురి చేశారని ప్రకాష్‌రాజ్ ఆరోపించారు. అతనికి గుణపాఠం నేర్పాలని అన్నారు.
ప్రశాంత్ సంబర్గిపై ప్రకాష్‌రాజ్ ఫిర్యాదు
దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment