సైకిల్‌పై వినూత్నంగా.. ప్రజలకు చేరువగా..
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణంలో శనివారం విజయనగర జిల్లాధికారి సైకిల్‌పై పర్యటించి, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలోని ప్రాథమిక సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. భక్తుల విరాళాలతో కొత్తగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి జంట రథాల పనులను ఆయన పరిశీలించారు. రాబోయే రథోత్సవానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 ప్రాజెక్ట్ కింద మరియమ్మనహళ్లి పట్టణానికి తుంగభద్ర నది నుంచి నీటిని సరఫరా చేసే పనులను, ప్రెజర్ ఫిల్టర్ అండ్ జాక్‌వెల్ ప్రాంతాన్ని పరిశీలించారు. రథోత్సవం ప్రారంభానికి ముందు పట్టణంలోని అన్ని ఇళ్లకు నది నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో వేడి భోజనం తయారీ, ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యారంగంలో పురోగతి, ప్రాథమిక సౌకర్యాలపై చర్చించారు. అందుబాటులో ఉన్న పత్రాలను తనిఖీ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పౌరులకు ఫారం– 3ని వెంటనే పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించని లే అవుట్లకు బీ–ఖాతా జారీ చేయడానికి సూచనలు ఇచ్చారు. ఆర్‌టీసీ బస్టాండ్, ఇతర బహిరంగ స్థలాల్లో ప్రాథమిక సౌకర్యాల గురించి ప్రజల నుంచి సమాచారం అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా అధికారి మనోహర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరియమ్మనహళ్లిలో పర్యటించిన
జిల్లాధికారి
నాలుగో శనివారం సెలవు రోజైనా ప్రజల మధ్యనే
సైకిల్‌పై వినూత్నంగా.. ప్రజలకు చేరువగా..
Comments
Please login to add a commentAdd a comment