రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ సహాయ శాఖ మంత్రి సోమన్న, వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజెలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాయచూరుకు మొండి చెయ్యి చూపారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో రాయచూరులో ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు.
ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తెండి