మత్తుకు యువత దూరంగా ఉండాలి
బళ్లారిటౌన్: మత్తు పదార్థాల వల్ల చెడు ప్రభావం కలుగుతున్నందున వాటికి యువత దూరంగా ఉండాలని ప్రభుత్వ సరళాదేవి కళాశాల ప్రిన్సిపాల్ ప్రహ్లాద చౌదరి పేర్కొన్నారు. ఆయన కర్ణాటక మద్యపాన సంయమ మండలి, వార్త సమాచార శాఖ, జాతీయ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం మంగళవారం కళాశాలలో చేపట్టిన మత్తు పదార్థాలతో కలిగే చెడు ప్రభావం గురించి విద్యార్థులకు ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. నేటి యువత మంచి అలవాట్లను అలవరుచుకొని జీవితం కొనసాగించాలన్నారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యాలు పాడవడమే కాక ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉందన్నారు. విద్యార్థి జీవితం సుందరమైన పుష్పం లాంటిదన్నారు. తమ జీవితాలను దురలవాట్లకు దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్‌ఓ యల్లా రమేష్ బాబు మాట్లాడుతూ 16 నుంచి 22 వయస్సు గల యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బలి అవుతున్నారన్నారు. దాదాపు 55 శాతం వరకు యువత ఉన్నట్లు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చలనచిత్రాల మనోరంజక దృశ్యాలను అలవరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో కుష్టురోగ నిర్మూలన అధికారి వీరేంద్రకుమార్, బీ.రామస్వామి, ప్రవీణ్‌కుమార్, చెన్నబసవయ్య, నజియా ఖాజీ, ఈశ్వర్ దానప్ప, వీసీ గురురాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment