వైభవంగా రాచోటి ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా అత్తనూరులో మంగళవారం రాచోటి శివాచార్య 21వ పుణ్యారాధన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఊరేగింపునకు సోమవారపేట హిరేమఠ బృహన్మఠాధిపతి అబినవ రాచోటి వీరశివాచార్యులు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గ్రామంలో తాగునీటి కోసం బావి, చెరువు తవ్వించి దాహార్తిని తీర్చారన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించిన మహాస్వామి రాచోటి శివాచార్య అన్నారు.
వేడుకగా వసంతోత్సవం
రాయచూరు రూరల్: నగరంలోని నవోదయ కాలనీలో వెలసిన వేంకటేశ్వర ఆలయంలో కల్యాణ, పుష్పయాగ ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. మంగళవారం నవోదయ వైద్య సంస్థల ఆధ్వర్యంలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి దంపతులు లక్ష్మీవేంకటేశ్వరాలయంలో లక్ష్మీ వేంకటేశ్వరుడికి, గోమాతకు పూజలు జరిపారు. పుష్పయాగంతో దేవుడిని ఊరేగించి వసంతోత్సవాలు జరుపుకున్నారు.
సమస్యలపై స్పందించరూ
రాయచూరు రూరల్: బాగల్‌కోటె జిల్లా ఇలకల్‌లో నెలకొన్న సమస్యలపై నగరసభ అధికారులు స్పందించడం లేదని మాజీ శాసన సభ్యుడు దొడ్డనగౌడ ఆరోపించారు. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. పట్టణంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మరుగుదొడ్ల ఏర్పాటు, మట్కా జూదాలను కట్టడి చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
రాయచూరు రూరల్: నగరంలోని బసవేశ్వర సర్కిల్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతునికి సుమారు 40 ఏళ్ల లోపు వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ వెల్లడించారు.
మస్కి పురసభ
ముఖ్యాధికారి సస్పెండ్
రాయచూరు రూరల్: లింగసూగూరు తాలూకా మస్కి పురసభ ముఖ్యాధికారి రెడ్డి రాయన గౌడ సస్పెండ్ అయ్యారు. సోమవారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని అందిన ఫిర్యాదు మేరకు జిల్లాధికారి ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మస్కిలో నూతన కార్యాలయ నిర్మాణానికి మంజూరైన రూ.57 లక్షల నిధులతో నియమాలను ఉల్లంఘించి పీఠోపకరణాలను కొనుగోలు చేశారని, అందులో కూడా అక్రమాలు జరిగాయని అందిన ఫిర్యాదులో వాస్తవాలు బయట పడడంతో విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లాధికారి నితీష్ తెలిపారు.
పచ్చదనంతో పర్యావరణ
సంరక్షణ
సిరుగుప్ప: ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున సామాజిక కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని కల్పవృక్ష సేవా బృంద సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్ క్లాత్ స్టోర్ యజమాని, కుటుంబ సభ్యులు, కల్పవృక్ష సేవా బృంద సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా రాచోటి ఉత్సవాలు
వైభవంగా రాచోటి ఉత్సవాలు
వైభవంగా రాచోటి ఉత్సవాలు
వైభవంగా రాచోటి ఉత్సవాలు
వైభవంగా రాచోటి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment