
ధర పతనం.. దిగుబడి అధికం
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా ఉన్న రాయచూరు ఏపీఎంసీ మార్కెట్‌లో ఉల్లిగడ్డల ధరలు పెరగడం లేదు. గత ఐదేళ్ల నుంచి జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడంతో ఈఏడాది వానలు కురిిసినా తడిసిన ఉల్లిగడ్డలకు ధరలు తగ్గాయి. రాయచూరు, మాన్వి, సింధనూరు, లింగసూగూరు, మస్కి, దేవదుర్గల్లో రైతులు ఉల్లిగడ్డలను అధికంగా పండించారు. ప్రతి నిత్యం వేలాది బస్తాలు రాయచూరు వ్యవసాయ మార్కెట్‌కు వచ్చి పడుతున్నా ధర మాత్రం రైతులకు నిరాశ కల్గిస్తోంది.
రాశులుగా పడి ఉన్న సరుకు
విక్రయానికి వచ్చిన సరుకు మార్కెట్‌లో రాశులుగా పడి ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మార్కెట్‌లో క్వింటాల్‌కు నాణ్యతను బట్టి రూ.1010–1400 వరకు ఉంది. రైతులు తాము పండించిన ఉల్లిగడ్డలకు మార్కెట్లో ఉన్న ధరపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సింధనూరు మార్కెట్‌లో ధర రూ.1,600 కాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కేవలం రూ.1010గా ఉంది. రాయచూరు ఏపీఎంసీలో కేవలం ముగ్గురు వర్తకులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల నుంచి ఉల్లిగడ్డల విక్రయాలకు అవకాశం లేదంటూ అధికారులు, వర్తకులు ప్రకటించారు.
నిరాశాజనకంగా మద్దతు ధర
ఉల్లిగడ్డల రైతన్న కంట కన్నీరు
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
రాయచూరు ఏపీఎంసీ మార్కెట్‌లో నిల్వ ఉంచిన ఉల్లిగడ్డ చిరు జల్లులకు తడిచి పోయినందున ప్రభుత్వం ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించాలి.
– లక్ష్మణగౌడ, రైతు సంఘం అధ్యక్షుడు

ధర పతనం.. దిగుబడి అధికం

ధర పతనం.. దిగుబడి అధికం