
సాక్షి, బెంగళూరు: కిల్లర్ కరోనా కేసులు బాగా అదుపులోకి వచ్చాయి. ఈ నెల 10 నుంచి మొదలైన లాక్‌డౌన్ ఇందుకు దోహదం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 26,811 మంది కరోనా బారిన పడ్డారు. అంతకుమించి 40,741 మంది కోలుకున్నారు. అయితే మృత్యు ప్రకోపం కొనసాగుతోంది. మరో 530 మంది విగతజీవులయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,99,784కు పెరిగింది. అందులో 20,62,910 మంది కోలుకున్నారు. ప్రాణనష్టం 26,929కి ఎగబాకింది. ప్రస్తుతం 4,09,924 మంది చికిత్స పొందుతున్నారు.
బెంగళూరులో 6,433 కేసులు..
సిలికాన్ సిటీలో కరోనా తీవ్రత బాగా తగ్గింది. కొత్తగా 6,433 కేసులు, 18,342 డిశ్చార్జిలు, 285 మరణాలు సంభవించాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,37,929కు పెరిగింది. అందులో 9,18,423 మంది కోలుకున్నారు. 12,148 మంది మృతిచెందారు. ఇంకా 2,07,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- 1.27 లక్షల మందికి టీకా..
- 1,27,317 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. మొత్తం టీకాలు 1.25 కోట్లను దాటాయి.
- మరో 1,37,584 కరోనా పరీక్షించగా మొత్తం టెస్టులు 2,90,61,302 కు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment