
●బర్డ్‌ఫ్లూ బలాదూర్!
సత్తుపల్లిటౌన్: కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకుతుందన్న ప్రచారంతో జనం చికెన్ తినడానికి జంకుతున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు పడిపోగా, 70 సెంటీగ్రేడ్‌కు మించి వేడితో ఉడికించిన చికెన్, కోడిగుడ్లతో ఎలాంటి ప్రమాదం ఉండదని కోళ్లఫారమ్‌లు, పౌల్ట్రీ సంస్థల యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా వెన్‌కాబ్ ఆధ్వర్యాన సత్తుపల్లి పోస్టాఫీస్ సెంటర్‌లో శనివారం రాత్రి ఉచితంగా చికెన్ ప్రై, ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా 70 – 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిపై ఉడికిస్తున్నందున చికెన్, కోడిగుడ్లతో ప్రమాదం ఉండదని, ప్రజలు అపోహలు విడనాడాలని కోరారు. దీంతో జనం బారులుదీరి చికెన్, గుడ్లు తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు ఎం.రాము, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పవన్, శ్రీనివాస్, మట్టా చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత చికెన్, ఎగ్‌మేళాలో జనం రద్దీ
Comments
Please login to add a commentAdd a comment