
బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ, ఫీజు వసూళ్లపై మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ సమీక్షించారు. ఖమ్మంలో శనివారం ఆయన కార్యదర్శులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. వెనకబడిన చోట మార్చి నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని, వ్యాపారుల నుంచి బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, ప్రభుత్వ సంస్థల వద్ద పేరుకుపోయిన బకాయిలపైనా శ్రద్ధ చూపాలన్నారు. ఖమ్మం సహా ఇతర మార్కెట్లలోనూ మిర్చి కొనుగోళ్లకు ఏర్పాట్లుచేయాలని, తద్వారా రైతులపై భారం తగ్గించాలని ఆదేశించారు. మద్దులపల్లి, నేలకొండపల్లి, ఏన్కూరు, వైరా, మధిరలో ట్రేడర్లు, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులతో సమావేశం కావాలని తెలిపారు. వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఎంఓలు ఎం.ఏ. అలీం, నరేందర్, ఖమ్మం ఉన్నతశ్రేణి కార్యదర్శి ప్రి.వీణ్‌కుమార్, గ్రేడ్–2 కార్యదర్శి వి.సుజన్‌బాబుతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 మార్కెట్ల కార్యదర్శులు, పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం మార్కెట్‌లోని మిర్చి యార్డును జేడీఎం శ్రీనివాస్, డీడీ పద్మావతి అధికారులు పరిశీలించారు.
మార్కెట్ల కార్యకలాపాలపై జేడీఎం సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment