ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
● ఆర్టీసీ కార్గో ద్వారా చేరవేసేలా ఏర్పాట్లు ● ఆన్‌లైన్ లేదా కార్గో పాయింట్లలో బుకింగ్‌కు అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో వచ్చేనెల 6న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి హాజరుకాలేని భక్తులకు తలంబ్రాలు ఇంటి వద్దే అందించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుంటే ముత్యంతో కూడిన తలంబ్రాల ప్యాకెట్‌ను ఇంటి వద్దే అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా లేదా బస్టాండ్లలోని కార్గో పాయింట్లు, ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
●సత్తుపల్లిటౌన్: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాల బుకింగ్ వివరాలతో రూపొందించిన కరపత్రాలను సత్తుపల్లిలో ఆర్టీసీ డీఎం యు.రాజ్యలక్ష్మి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితీ, మునీర్‌పాషా, బాబురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డిపోల వారీగా సంప్రదించాల్సిన నంబర్లు
ఖమ్మం 91542 98583
మధిర 91542 98584
సత్తుపల్లి 91542 98585
భద్రాచలం 91542 98586
కొత్తగూడెం 91542 98587
మణుగూరు 91542 98588
ఇల్లెందు 91542 98587
Comments
Please login to add a commentAdd a comment