బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ‘నెల్లూరి’
ఖమ్మంమయూరిసెంటర్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర ఎన్నికల కో రిటర్నింగ్ ఆఫీసర్ గీతామూర్తి పేరి ట ప్రకటన వెలువడింది. అలాగే, ఐదు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర కౌన్సిల్ కు ఐదుగురిని ఎంపిక చేశారు. ఇందులో డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు(ఖమ్మం), గడ్డం వెంకటేశ్వర్లు(పాలేరు), గుగులోత్ నాగేశ్వరరావు(మధిర), బి.సుజాత(వైరా), జె.నరేష్(సత్తుపల్లి) ఉన్నారు. ప్రస్తు తం జిల్లా అధ్యక్షుడిగా గల్లా సత్యనారాయణ ఉండగా ఆయన స్థానంలో ఎంపికైన కోటేశ్వరరావు స్వస్థలం కొణిజర్ల మండలం అమ్మపాలెం. 2012లో ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా తన ప్రస్తానం ప్రారంభించిన ఆయన పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment