ఎప్పటికప్పుడు పరిష్కరించండి
● గ్రీవెన్స్ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు ● అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో భాగంగా వారు ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారు లతో పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించిన అదనపు కలెక్టర్లు పలు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
●ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపాన వ్యాపారాలు చేసుకుంటున్న తమకు అక్కడ కనీస వసతులు కల్పించాలని చిరువ్యాపారులు విన్నవించారు.
●కూసుమంచి మండలం పెరిక సింగారంలోని సర్వే నంబర్ 231లో 1.03గుంటల భూమి తన భర్త పేరిట ఉండగా, ఆడపడుచు నకీలీ పత్రాలతో పాసు బుక్ తీసుకుందని బి.ఆదెమ్మ ఫిర్యాదు చేసింది.
●ఖమ్మం దొరన్ననగర్‌కు చెందిన జి.నరేష్‌కు ఆయన భార్యతో గొడవలు జరుగుతుండగా, ఆమెకు వారి కుటుంబీకులు తన అనుమతి లేకుండా అబార్షన్ చేయించారని ఫిర్యాదు చేశాడు.
●ఖమ్మం టేకులపల్లిలో కేసీఆర్ టవర్స్‌లో నివాసముండే ఎస్.కే.హసీనా షార్ట్ సర్క్యూట్ కారణంగా సామగ్రి కాలిపోయినందున పరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment