
భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం
మధిర: ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో భూసమస్యలన్నింటినీ పరిష్కరించి, భూ యజమానులు, రైతులు సంతోషంగా ఉండేలా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మధిరలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూములలపై నెలకొన్న వివాదా లను పారదర్శకంగా పరిష్కరించేలా భూ భారతి అమలవుతుందని చెప్పారు. భూమి విలువ ఆధారంగా కలెక్టర్, ఆర్డీవో స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని, రికార్డుల నిర్వహణ మెరుగవుతుందని తెలిపారు. ఈమేరకు సదస్సుల్లో రైతులు పాల్గొని తమ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని, సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్‌లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఖమ్మం ఆర్డీఓ జి.నర్సింహారావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మధిర తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, అదనపు డీఆర్డోవో నూరుద్దీన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
●నేలకొండపల్లి: భూ భారతిపై నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా వచ్చిన దరఖాస్తులను నేలకొండపల్లి తహసీల్‌లో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పరిశీలించారు. ఎలాంటి సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయో ఆరా తీసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రాజేశ్వరి, ఆర్‌డీఓ నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, డీటీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, హెల్ప్‌డెస్క్‌లో అదనపు సిబ్బందిని నియమించి సదస్సులపై విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, బోయిన వేణు, కడియాల నరేష్ తదితరులు కలెక్టర్‌ను కోరారు.
●మధిర: మానవ సృష్టి, మనుగడ మహిళలతో సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించి ఆడబిడ్డలకు మగపిల్లలతో సమానంగా అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. మధిర మండలం దెందుకూరులో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఎస్.కే.సుహనా – సమీర్ దంపతులను ‘మా పాప.. మా ఇంటి మణిదీపం’లో కలెక్టర్ సన్మానించి మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి, సీపీఓ ఏ.శ్రీనివాస్, తహసీల్దార్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
‘భూ భారతి’ సదస్సులో
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం