
నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మంలో ఐటీ హబ్ నుంచి ఎన్‌టీఆర్ సర్కిల్ వరకు ఫుట్‌పాత్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, టేబుల్ టెన్నిస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక సీఎం కప్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు. శనివారం ఉదయం ఖమ్మం 44వ డివిజన్ రైతు మార్కెట్‌లో షెడ్ల నిర్మాణం, టేకులపల్లిలో సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, ఆదివారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, కొత్తగూడెంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి, 10–30 గంటలకు పోస్టాఫీస్ సెంటర్‌లో చేకూరి కాశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ఉత్తీర్ణత పెరిగితేనే నమ్మకం
బోనకల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపు ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం ఏర్పడుతుందని ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారి యాదగిరి సూచించారు. జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాధికారి రవిబాబుతో కలిసి గురువారం ఆయన బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా వారు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడం ద్వారా తల్లిదండ్రుల్లో నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఈ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ నళిని, అధ్యాపకులు పాల్గొనగా, వచ్చే విద్యాసంవత్స రం ప్రవేశ కరపత్రాలను ఆవిష్కరించారు.
గురుకులాల ఆర్‌సీఓగా అరుణకుమారి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఖమ్మం రీజియన్ గిరిజన సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి(ఆర్‌సీఓ)గా అరుణకుమారి నియమితులయ్యారు. గతంలో ఆర్‌సీఓగా పనిచేసిన నాగార్జునరావు ను మేడ్చల్‌కు బదిలీ చేయగా, ఆ స్థానంలో దమ్మపేట మండలం అంకంపాలెం గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారిని నియమించారు. ఈ విషయాన్ని గురుకులాల పరిపాలనాధికారి నరేందర్ తెలిపారు.
‘ఎర్లీబర్డ్’ గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ముందస్తుగానే వంద శాతం ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ ఇచ్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎర్లీబర్డ్ స్కీం గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు ఇతర మున్సిపాలిటీల కమిషనర్లకు ఫోన్ ద్వారా ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలకు ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, ఎర్లీబర్డ్ ద్వారా కేఎంసీకి ఏప్రిల్‌లో రూ.10.13 కోట్లు ఆదాయం సమకూరిందని వెల్లడించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య.. ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు.
డీఈఓగా బాధ్యతలు
స్వీకరించిన ‘సామినేని’
ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా ఉన్న సోమశేఖరశర్మ ఉద్యోగ విరమణ చేయడంతో డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణను ఆ స్థానంలో నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్మానించారు. కాగా, విద్యావ్యవస్థను పటిష్టంలో చేయడంలో భాగంగా డీఈఓలకు శిక్షణ నిర్ణయించారు. ఈక్రమంలో శుక్రవారం మొద లయ్యే శిక్షణకు సత్యనారాయణ వెళ్తున్నారు.

నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన

నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన