నేడు ఆయుర్వేద శిబిరం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ద్వారా మాతా రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్‌లో ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. గోలేటిలోని సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వందశాతం పన్నులు వసూలు చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీల వారీగా పన్నులు వసూలు పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ, శానిటేషన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment