పోడురైతుల జోలికొస్తే ఊరుకోం
● ఎమ్మెల్సీ దండె విఠల్
పెంచికల్‌పేట్: అటవీశాఖ అధికారులు పోడురైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ దండె విఠల్ హెచ్చరించారు. మండలంలోని కొండపల్లిలో మంగళవారం పోడు భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాల్సి ఉండగా ఇరు శాఖల అధికారులు సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. పోడు రైతుల పక్షాన కేంద్ర మంత్రులను కలిసి సమస్య విన్నవిస్తానన్నారు. అంతకుముందు చేడ్వాయి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మాజీ సర్పంచులు చౌదరి సుజాత శ్రీనివాస్, చంద్రమౌళి, ఎల్కరి సుధాకర్, నాయకులు సముద్రాల రాజన్న, రాచకొండ కృష్ణ, ఇలియాస్, సధాశివ్, నందు, శంకర్‌గౌడ్, రైతులు ఉన్నారు.
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం
బెజ్జూర్: ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ నెల 20న కాగజ్‌నగర్ మండలం వినయ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి మంత్రి సీతక్క రానున్నారని నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కుర్సంగే ఓంప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ పంద్రం పుష్పలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, సలుగుపల్లి మాజీ సర్పంచ్ కొడుప విశ్వేశ్వర్, మర్తిడి మాజీ సర్పంచ్ ఉమ్మెరి లింగయ్య, సామల రాజన్న, ఉమా మహేష్, సిరిపురం సదాశివ్, రంగు సురేష్ గౌడ్, గుమ్ముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment