వేసవిలో తాగునీటి సమస్యలు రానీయొద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని అందించాలన్నారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ గ్రామాల్లో నీటి సమస్యలు రానీయొద్దని, పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. పైలెట్ గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వార్షిక రుణలక్ష్యాలు సాధించాలి
ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రైతులు, లబ్ధిదారులకు రుణాలు అందించాలన్నారు. వ్యవసాయ రంగానికి నిర్దేశించిన రుణ లక్ష్యం రూ.2,289 కోట్లు కాగా రూ.1,268 కోట్లు అందించామని తెలిపారు. జిల్లాలోని 6,592 స్వయం సహయక సంఘాలకు రుణాలు అందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధాన మంత్రి ముద్ర, స్టాండ్ అప్ ఇండియా పథకాల కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్ జోషి, డీఆర్‌డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment