1098 నంబర్‌కు సమాచారం ఇవ్వండి
వాంకిడి(ఆసిఫాబాద్): పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్ అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాల కల్పన, సమస్యల గురించి ఆరా తీశారు. మెనూ తప్పనిసరిగా పాటిస్తూ విద్యార్థినులకు వేడి ఆహారం అందించాలన్నారు. పాఠశాల ఆవరణలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో చదువుపై విద్యార్థులు ఏకాగ్రత ఉంచాలన్నారు. తమ దృష్టికి సమస్యలు తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆయన వెంట కౌన్సెలర్ చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాలప్రవీణ్, కేస్ వర్కర్ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం మడుగుల నారాయణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment