ప్రజాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
కాగజ్‌నగర్‌రూరల్: ప్రజాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పట్టణంలోని వినయ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కేంద్రం నిధులు అందక పల్లెలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కేవలం మాటలతోనే కోటలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రచార సభ గురించి అందరు నాయకులకు సమాచారం అందించామని, అయితే కొంతమంది రాలేదని తెలిపారు. వారు తీసుకునే నిర్ణయం ఆధారంగా.. తర్వాత మేం మాట్లాడుతామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని తెలిపారు. వేలాది మంది రైతులు పోడు భూములపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే రెవెన్యూ, ఫారెస్టు ఉమ్మడి సర్వే నిర్వహించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే సక్కు, సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్ర మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment