నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
ఆసిఫాబాద్‌రూరల్: వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, వసతి గృహాల పర్యవేక్షణ సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment