అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కెరమెరి: మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రజామరుగుదొడ్లు, ఇందిరమ్మ మాడల్ హౌస్‌ను డీపీవో భిక్షపతిగౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీపడవద్దన్నారు. మరుగుదొడ్లు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం సాకడలో మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వరరావు, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, తదితరులు ఉన్నారు.
గ్రంథాలయాల్లో వసతుల కల్పనకు కృషి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని గ్రంథాలయాల్లో పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి దిన, వార, మాస పత్రికలు, చరిత్ర పుస్తకాలు సమకూర్చాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, డీపీవో భిక్షపతిగౌడ్, డీఈవో గమానియల్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment