8న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్‌రూరల్: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించేందుకుగానూ మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవన సముదాయంలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, ప్రి లిటిగేషన్, బ్యాంకింగ్, భూ సమస్యలు, వాహనాల ప్ర మాదాల కేసులను రాజీమార్గం ద్వారా పరి ష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు.
ఐదు మండలాల రాకపోకలకు అనుమతి
జన్నారం: టైగర్‌జోన్ కోర్ ఏరియా నుంచి 24గంటలు ఐదు మండలాల ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తూ ఎఫ్‌డీపీటీ శాంతారాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. కడెం, దస్తురాబాద్, ఉట్నూర్, జ న్నారం, దండేపల్లి మండలాల ప్రజలకు ఎ లాంటి పర్యావరణ శిస్తు వసూలు చేయడం ఉండదని, ఆయా మండలాల ప్రజలు ధ్రు వీకరణ పత్రం చూపించి ఏ సమయంలోనైనా ఈ ప్రాంతం గుండా వెళ్లవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment