అన్ని రంగాల్లో మహిళల ముద్ర
రెబ్బెన(ఆసిఫాబాద్): నేటితరం మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. కై రిగూడ ఓసీపీ వద్ద శనివారం మహిళా బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్లకు పదోన్నతులు, వివిధ హోదాల ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. సింగరేణిలో ఉద్యోగాలు, పదోన్నతుల కాలపరిమితి గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మొత్తం 16 డిజిగ్నేషన్లతో ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. మహిళా బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్లు ఎంచుకున్న డిజిగ్నేషన్లకు అనుగుణంగా వారికి శిక్షణ అందించిన తర్వాత సంబంధిత ఉద్యోగాలకు పంపిస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో ఆసక్తితో దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగులు ప్రస్తుతం ఎంవీటీసీలో పంపు, కన్వేయర్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, పీవో నరేందర్, డీజీఎం ఉజ్వల్‌కుమార్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, డీవైజీఎం వేణు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment