అభివృద్ధి పనుల నివేదిక రూపొందించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌రూరల్: ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నివేదిక రూపొందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శనివారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3కోట్ల నిధులతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్డ్ యూనిట్ కేంద్రం ఏర్పా టు, మారుమూల గ్రామాల్లో అంబులెన్స్ సర్వీసు, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, గురుకుల పాఠశాలల్లో శుద్ధమైన తాగు నీరందించేందుకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, తదితర అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ముగిసిన తర్వాత పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స మావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఈ వో గమానియల్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి సజీవన్, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, పశు సంవర్ధకశాఖ అధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment