స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో ఫలితాలు
కెరమెరి(ఆసిఫాబాద్): స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ ధారాళంగా చదవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీవో మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలని సూచించారు. సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బోర్ నీటి నాణ్యతను టీడీఎస్ పరికరంతో పరీక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ప్రేందాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment