జీఎం విజయ భాస్కర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా విజయ భాస్కర్‌రెడ్డి సోమవారం గోలేటిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏరియా జీఎంగా పనిచేసిన శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాకు బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో విజయ భాస్కర్‌రెడ్డిని సింగరేణి యాజమాన్యం నియమించింది. గోలేటిలోని కార్యాలయం వద్ద సిబ్బంది నూతన జీఎంను శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, కై రిగూడ పీవో నరేందర్, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment