నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీ, హౌజింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కా ర్యదర్శులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీ క్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణా ళికతో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తిపన్నులు వసూలు చేసేలా అధి కారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. లేఅవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్– 2020లో భాగంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత గల వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జాబ్‌కార్డు కలిగిన వారికి వందరోజుల ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం, సాయంత్రం పనులు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment