ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్థిక కార్యకలాపాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్‌జోషి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపా రు. మహిళలు గృహ బడ్జెట్, సూక్ష్మ పొదుపు తదిత ర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
సెల్ టవర్ల ఏర్పాటుకు సమన్వయంతో కృషి చేయాలి
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ అందించేందుకు వీలుగా సెల్ టవర్ల ఏర్పాటుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అటవీశాఖ అధికారి సుశాంత్‌తో కలిసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టవర్ల నిర్మాణంపై రెవెన్యూ, అటవీ, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న టవర్ల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న టవర్ల నిర్మాణ స్థలాలను రెండు రోజుల్లో డీజీపీఎస్ చేసి రెవెన్యూ అధికారులు నివేదించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు, రేంజ్ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అధికారులు పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసే సామగ్రి పంపిణీ కేంద్రానికి ఈ నెల 26న ఉదయం 9 గంటలకే చేరుకోవాలని సూచించారు. సామగ్రి, బ్యాలెట్ పేపర్, బాక్సులను సరిచూసుకోవాలన్నారు. అనంతరం కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటింగ్ కోసం వేర్వేరుగా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బాక్సులను సీజ్ చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఆర్డీవో లోకేశ్వరావు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment