శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్: పదో తరగతి వార్షిక ఫలి తాల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన ఐదు వారాంతపు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. రానున్న 24 రోజుల్లో షెడ్యూల్ ప్రకారం బోధించాలని సూచించారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా కేటాయించిన నిధులు డ్రా చేయాలన్నారు. సమావేశంలో ఏసీజీఈ ఉదయ్‌బాబు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి వెంకటేశ్వరస్వామి, ఎఫ్‌ఏవో దేవాజీ, కోఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment