ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్థిక అక్షరాస్యతపై మహిళలకు అవగాహన అవసరమని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్ జోషి అన్నా రు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మంగళవారం అవగాహన కల్పించారు. ఆయ న మాట్లాడుతూ ప్రతీ రూపాయి ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని, అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నా రు. బ్యాంకు మేనేజర్ జీవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీపీఎం అన్నాజీ, ఏపీఎం సదానందం, బ్యాంకు సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment