ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో అరిగెల నాగేశ్వర్‌రావు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యావంతులు విజ్ఞాతతో ఆలోచించి ఓటు వేయా లని కోరారు. అంజిరెడ్డి, కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. యువత బీజేపీకి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు మల్లికార్జున్, విజయ్, పెంటయ్య, గణేశ్, ప్రసాద్‌గౌడ్, శ్రీకాంత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment