ఆసిఫాబాద్‌అర్బన్: ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు, ముస్లిం మతపెద్దలు, మసీద్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రార్థన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఇన్‌చార్జి మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రమాదేవి, డీఆర్‌డీవో దత్తారావు, విద్యుత్‌శాఖ ఎస్ ఈ శేషారావు, డీఎంహెచ్‌వో సీతారాం, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, తహసీల్దార్ రోహిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment