ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, సెక్టార్ మోడల్ అధికారులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందన్నారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి రిసెప్షన్ కేంద్రాలకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. బుధవారం సంబంధిత అధికారులు సామగ్రి తీసుకోవాలని సూచించారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోలింగ్ ఏజెంట్లు కేంద్రాలకు హాజరయ్యేలా చూ డాలన్నారు. డ్రా పద్ధతిలో రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు కేటాయిస్తామని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాల్గొన్నారు.
ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
వాంకిడి: ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మూత్రశాలలు, లైటింగ్, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించాలని తహసీల్దార్ రియాజ్ అలీని ఆదేశించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, హెచ్‌ఎం నటరాజ్ ఉన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment