● నేడు మహాశివరాత్రి
● విద్యుత్ దీపాలతో ఆలయాలు ముస్తాబు ● పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు ● తరలిరానున్న భక్తజనం
లయకారుడు.. ముక్కంటి.. కై లాసవాసి.. ఇలా ఏ పేరుతో పిలిచినా భక్తుల కోర్కెలు తీర్చేవాడు బోళా శంకరుడు మహాశివుడు. సృష్టికి మూలమైన పరమేశ్వరుడిని పూజిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివపూజకు మహాశివరాత్రిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు ఆదిశంకరునికి అభిషేకం చేసి.. పూజించి.. ఉపవాసం చేసి.. జాగరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ముక్కంటిగా భక్తకోటితో నిరంతరం పూజలందుకుంటున్న అభిషేక ప్రియుడి నామస్మరణతో బుధవారం మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు. మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాలపై ప్రత్యేక కథనం.
Comments
Please login to add a commentAdd a comment