రెబ్బెన: మండలంలోని నంబాలలో ప్రసిద్ధి గాంచిన ప్రసన్న పరమేశ్వర ఆలయంలో మూడు రోజులపాటు జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణంతోపాటు రథోత్సవం కనుల పండువగా జరగనున్నాయి. స్థల పురాణం ప్రకారం.. 67 ఏళ్ల క్రితం తాండూర్ మండలం కొత్తపల్లెకు చెందిన మైదం లస్మయ్య వంగిపోయిన నడుంతో బాధపడుతుండేవాడు. ఒక రోజు నంబాలకు ఎంతో కష్టపడుతూ వస్తుండగా మార్గమధ్యలో ఒక నాగసర్పం కనిపించింది. అది చూసి భయకంపితుడు కాగా వెంటనే ఆ సర్పం మాయమై ఒక బండరాయిపై సాధువు ప్రత్యక్షమై భయపడొద్దు అంటూ లస్మయ్యకు ధైర్యం చెప్పాడు. సాధువు కళ్లు మూసుకోమని చెప్పడంతో లస్మయ్య కళ్లు మూసుకున్నాడు. అతడి నడుము చుట్టూ నాగ సర్పం చుట్టుకుంది. నీ నడుం బాగైంది చూసుకోమని సాధువుతో పాటు నాగసర్పం.. రెండూ అదృశ్యమయ్యాయి. భక్తుల కోరికలు తీర్చేందుకు ఇ క్కడ అవతరిస్తున్నాని, భక్తిశ్రద్ధలతో పూజించేవారి కోరికలు నెరవేరుస్తానని అతడికి చెప్పారు. వెంటనే లస్మయ్య ఆరోగ్యంతో నంబాలకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఆనాటి నుంచి ప్రసన్న పరమేశ్వరుడు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతాడని స్థానికులు నమ్ముతారు. ఆలయంలో గణపతి, శివలింగం, పార్వతీదేవి, నందాఈశ్వరుడు, నాగేంద్రుడు, సూర్య భగవానుడు, ఆంజనేయస్వామి, నవ గ్రహాలు విగ్రహాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment