‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపం’
సిర్పూర్(టి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని వెంకట్రావ్‌పేట్ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం, సీసీఐ అధికారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మార్చి 15 వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లెండుగురె శ్యాంరావ్, షేక్ చాంద్, రాజు, రాజేశ్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.
జిన్నింగ్ మిల్లు పరిశీలిస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment