మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన రామటెంకి బానేష్ మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం..బానేష్ (36) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మొదటి భార్యతో విడాకులయ్యాయి. పదేళ్ల క్రితం పుష్పను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2022లో ఆయన గుండెకు స్టంట్లు వేశారు. అప్పటి నుంచి పని చేయకుండా ఇంటి వద్ద ఉంటున్నాడు. గతేడాది అక్టోబర్‌లో పుష్ప ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన వెంకటేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో పలుమార్లు గొడవలు జరుగాయి. ఈ క్రమంలో బానేష్ మందలించడంతో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పుష్ప, బానేష్‌లపై రెబ్బెనలో కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసు విషయంలో బానేష్ కొంత అప్పుల పాలయ్యాడు. మంగళవారం భార్య డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆమె ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించింది. ఎస్సై ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించారు. బానేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని మేనత్త కోట పోషమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
హైవే పక్కన గుర్తుతెలియని మృతదేహం
వాంకిడి: మండలంలోని ఖమాన ఎక్స్‌రోడ్ సమీపంలో నేషనల్ హైవే–363 పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖమాన ఎక్స్‌రోడ్ సమీపంలో పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకుడు.. మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్సై ప్రశాంత్‌ను వివరణ కోరగా మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మృతిచెందిన వ్యక్తి ఎవరు? ఎన్ని రోజులైంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment