
సర్వం.. శివోహం
ఆసిఫాబాద్‌అర్బన్: పట్టువస్త్రాలు తీసుకువస్తున్న ఎమ్మెల్యే
ఆసిఫాబాద్‌అర్బన్/వాంకిడి/రెబ్బెన: మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్ ఆలయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట శివకేశవ మందిర్‌లో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు తిరుపతిచారి పూజలు చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి పట్టువస్త్రాలు కల్యాణ మండపానికి తీసుకువచ్చి సమర్పించారు. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు తీరంలో బుధవారం నిర్వహించిన జాతర జనసంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులు శివకేశవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి భజనతో జాగరణ చేపట్టారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గాదె ప్రవీణ్, సభ్యులతో మాట్లాడి ఆలయం విశిష్టత, చరిత్ర తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ పూజలు చేశారు. వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. రెబ్బెన మండలం నంబాలలోని ప్రసన్న పరమేశ్వర ఆలయంతోపాటు దుర్గాపూర్‌లోని శివాలయం, గోలేటి టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయ ప్రాంగణంలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రసన్న పరమేశ్వర ఆలయ జాతరకు భక్తులు పోటెత్తారు. నంబాల, గోలేటిలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వేదపండితులు కనుల పండువగా జరిపించారు. నంబాల శివాలయంలో సాయంత్రం అశేష భక్తజనం మధ్య శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు. నంబాలలోని ప్రసన్న పరమేశ్వర ఆలయంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ పూజలు చేశారు. బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి ప్రసన్న పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

సర్వం.. శివోహం

సర్వం.. శివోహం

సర్వం.. శివోహం
Comments
Please login to add a commentAdd a comment