జెండా ఊపి ఎన్నికల సిబ్బంది వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లాలో గురువారం జరిగే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో బుధవారం ఉదయం ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ అధికారులు సంబంధిత సిబ్బందికి పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాహనాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం సిబ్బంది సామగ్రిని తీసుకుని పోలీసుల భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో 6,137 మంది పట్టభద్రులు, 470 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆసిఫాబాద్ డివిజన్‌లో 8 కేంద్రాలు, కాగజ్‌నగర్‌లో 9 కేంద్రాలు ఉన్నాయి. పట్టభద్రుల కోసం రెండు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక కేంద్రం ఉండగా, 14 కామన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 19 మంది ప్రిసైడింగ్ అధికా రులు, 87 మంది ఏపీవోలు, 17 మంది సూక్ష్మ పరి శీలకులను నియమించారు. గురువారం ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఓటింగ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 17 పోలింగ్ కేంద్రాలకు 17 రూట్లలో పోలింగ్ సామగ్రిని పోలీసు బందోబస్తుతో తరలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికా రులు చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తయ్యాక సామగ్రి, సిబ్బందిని పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా చేరేలా ఏర్పాట్లు చేశారు.
మద్యం షాపుల మూసివేత
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివేశారు. జిల్లా కేంద్రంలోని ఐదు మద్యం దుకాణాలతో పాటు జిల్లావ్యాప్తంగా 19 దుకాణాలు పోలింగ్ పూర్తయిన తర్వాతే తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
పటిష్ట బందోబస్తు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్ర శాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా 250 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 210 మంది ఇతర పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్ద 163బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్(144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు వందమీటర్ల దూరం వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపుగా తిరగొద్దని, పార్టీ జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ప్రదర్శించొద్దని సూచించారు.
ఇవి అవసరం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు గుర్తింపు కార్డులు అవసరం. ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, ఇండియన్ పోస్‌పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గంలో విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, విశ్వవిద్యాలయం జారీ చేసిన డిగ్రీ, డి ప్లొమా నిజ ధ్రువపత్రం, సంబంధిత సంస్థలు చేసిన ది వ్యాంగ సర్టిఫికెట్, భారత ప్రభుత్వ సంస్థ సో షల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ జారీ చేసిన యూని క్ డిజిబులిటీ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని ఉపయోగించి ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment