
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
● కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా
కౌటాల: ఎమ్మెల్సీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నిర్వహించే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, రిసెప్షన్ కేంద్రాలకు అప్పగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎన్నికల అధికారులు పి.ప్రేమలత, చౌదరి అంజన్న, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment